తపస్వి

myriad of thoughts

Friday, February 16, 2007

హృదయలేఖ నా సఖికి.....


నీవు మీ పుట్టింటికి వెళ్ళావో లేదో నా గుండె గూటిలోని భావాలకు రెక్కలొచ్చి..ఇదిగో ఇలా కాగితం పైకి వచ్చి..నిన్నుచేరేవరకు నిలవలేనంటున్నాయి..ఊరకనే కాదు సుమా!!..కొత్తపరిమలాలతో ..సుమీ మన ఎర్ర గులాబీ ఎంత అందంగా ఉందో తెలుసా?...మంచు బిందువులు ఇంకా సూర్ర్యుడి కౌగిలిలో కరిగిపోలేదనుకుంటా?.ఉషోదయం కదా!.నీవు స్నానం చేసి పెదాలపై నీరు సరిగా ఆరకముందు ఉంటావు చూడు అంత అందంగా ఉంది..మల్లెలు మాత్రం ఏంతక్కువ తిన్నై,నా ప్రియ సఖి ఏదా అని తొంగి మరీ చుస్తున్నయి..నువ్వు వచ్చాక తేల్చాలి నీవు నాకు సఖియో లేక మల్లెలకో ..లేకపోతేమరి ,ఎంతగా ఉడుక్కున్నానో నీకేం తెలుసు?.నువ్వు వచ్చేటప్పుడు బోల్డన్ని మాటల్ని తీసుకురా,సరేనా?..............పేరుకే దూరమై ఎప్పుడూ నీ ప్రక్కనే ఉండే .......
నీ.....

2 Comments:

At February 21, 2007 at 7:19 AM , Anonymous Anonymous said...

inni alOcanalanu kummarinci inkaa mounam gaa unTaarE.
mee vUhalni andaritO pancukOnDi..
intaki mI bhaarya evaru.
aaviDa ki cUpincaaraa.
caalaa santOshistaaru.
kUDali lO cEranDi.

annattu oka salaha
photos okko kavitaki maree ekkubva petteyyakandi
okko photo aite simple ga untundi.

 
At February 21, 2007 at 2:53 PM , Blogger రాధిక said...

పెళ్ళయిన మా లాంటి వాళ్ళు కూడా ప్రేమ,ఆకర్షణ అంటూ కవితలు రాసుకుంటూ కుర్చుంటుంటే మీరేమొ భార్య విరహాన్ని జాజులు,మల్లెలు,గులాబిల వర్ణనలతో అద్భుతం గా ఆవిష్కరిస్తున్నారు.చాలా చాలా బాగా రాసారండి.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home